నెమలి
వికీపీడియా నుండి
నెమలి భారత మరియు శ్రీలంక దేశాల జాతీయ పక్షి. నెమలిని చూడంగానే మనకు కొట్టొచ్చినట్లు కనబడేది వాటి అందమయిన ఈకలు. మగ నెమలికి మాత్రమే ఇటువంటి పొడావాటి ఈకలు ఉంటాయి.
మహాభారతంలో శ్రీకృష్ణుడు ఎప్పుడూ ఒక నెమలి ఈకను తన తలలో అలంకారంగా ధరించేవాడు. అంతేకాదు, పరమశివుని కుమారుడయిన సుభ్రమణ్యుడు నెమలిని తన వాహనంగా ఉపయోగిస్తాడు.
విషయ సూచిక |
[మార్చు] ఆహారం
నెమలి శాకాహారము మరియు మాంసాహారము రెండిటినీ ఆహారంగా స్వీకరిస్తుంది. పూవుల రెక్కలు, మొక్క బాగాలు, విత్తనం మొలకలు, కీటకాలు, అప్పుడప్పుడూ బల్లి వంటి సరీసృపాలను మరియూ కప్పలు వంటి ఉభయచరాలను ఆహారంగా భుజిస్తాయి.[1] [2]
[మార్చు] జాతులు
కాంగో నెమలి (ఆఫ్రోపావో కాంగోలెన్సిస్) - ఇది మధ్య ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో మనకు కనిపిస్తుంది.
భారత నెమలి (పావో క్రిస్టేటస్) - ఈ నెమలి మనకు భారత ఉప ఖండంలో తరుచుగా కనిపిస్తుంది. ఈ జాతి నెమలినే భారత మరియు శ్రీలంక దేశాలు తమ జాతీయ పక్షిగా ఎన్నుకున్నాయి.
ఆకుపచ్చ నెమలి (పావో మ్యూటికస్) - ఇది తూర్పు మయన్మారు నుండి జావా వరకు గల ప్రాంతాలలో కనిపిస్తుంది. ఈ జాతి నెమలి వేటవలన మరియు నివాసయోగ్యమయిన ప్రాంతాలు కరువవటం వలన అంతరించే దశకు చేరుకుంటున్నాయి. అంతరిస్తుందని భావిస్తున్న ఆకుపచ్చ రంగు నెమలి ఐదు వేరు వేరు జాతుల సమ్మేళనం, కానీ ప్రస్తుతం వీటిని ఒకే జాతికి చెందిన మూడు ఉప జాతులుగా వర్గీకరించారు.
[మార్చు] నివశించే ప్రదేశాలు
నెమలి ఎక్కువగా గడ్డిమైదానాలలో నివశిస్తుంటాయి.
[మార్చు] పించం - ఈకలు
మగ నెమల్లకు అందమయిన మెరిసే నీలం-ఆకుపచ్చ లేదా ఆకుపచ్చ రంగు పించం ఉంటుంది. మగ నెమలికి వెనుక బాగంలో తోకలాగా కనిపించేది, దాని పొడావాటి ఈకలు. ఆ ఈకలకు కళ్ళు ఉంటాయి, వాటి అందమంతా అవి పురివిప్పి నాట్య మాడుతున్నప్పుడే కనిపిస్తాయి.
ఆడ నెమలి ఆకుపచ్చ, గోధుమ మరియు బూడిద రంగులలో ఉండే పించం ఉంటుంది. మగ నెమల్ల వలె ఆడనెమలికి పొడావాటి తోక లాంటి ఈకలు ఉండవు, కానీ వీటికి ఒక కొప్పూంటుంది.
నెమలి పించాలలోని ఆ అత్బుత రంగులకు కారణం, వాటి ఈకలమీద పేర్చినట్లు ఉండే సన్నని పీచు లాంటి పదార్దాలే. అక్కడ కనిపించే వివిధ రంగులకు వాటి అమరికలోని నిడివి తేడాలే కారణం. గోధుమ రంగు ఈకలకు, ఎరుపు మరియు నీలం రంగులు అవసరం - వీటిలో ఒక రంగు అమరిక వలన సృస్టింపబడగా, రెండొవది హద్దులలో ఉండే ఇంకో అమరిక వలన వచ్చే కాంతి పరావర్తనం వలన ఏర్పడుతుంది. ఇటువంటి పరావర్తనం వలనే నెమలి నాట్యమాడుతున్నప్పుడు వాటి పించాలు మనకు వివిద కోణాలలో వివిద రంగులుగా కనిపిస్తాయి.[3]
ఇతర జాతులతో అంటకట్టించటం వలన వేరు వేరు రంగుల ఈకలున్న నెమల్లు మనకు కనిపిస్తాయి. అటువంటి వాటిలో తెల్ల శరీరం కలవి చెప్పుకోతగ్గవి.
[మార్చు] ప్రవర్తన
దాదాపు 2000 సంవత్సరాల కాలం నుండి మనుషుల పోషనలో నెమలి ఉన్నదని భావిస్తున్నారు.[4] అయినా కూడా నెమలికి మనుషుల దగ్గరగా ఉన్నప్పుడు జంతువులలో కనిపించే లక్షణాలు చాలా తక్కువగా వంటపడ్డాయి. కాకపోతే ఇతర కొత్త జాతులు సృష్టింపబడ్డాయి.
సాధారణంగా నెమలి జగడాల మారి, ఇతర పసుపక్షాదులతో అంతత్వరగా కలవవు.
[మార్చు] జతకట్టడం
జతకట్టుటకు సిద్దపడుతున్న మగ నెమలి అరుపును వినండి.
[మార్చు] మూలాలు
- ↑ నెమలిని పెంచుకునే విధానము
- ↑ నెమలికి వచ్చే వ్యాధులు
- ↑ స్టీవెన్ కె. బ్లావు, నెమలి ఈకలలో రంగులు ఎలా ఏర్పడతాయో వివరించే వ్యాసం, ఫిసిక్స్ టుడే, జనవరి 2004.
- ↑ హొనొలులు జంతు సంరక్షణాలయంవారి సైటులో నెమలి గురించి
[మార్చు] బయటి లింకులు
- ప్రపంచవ్యాప్త పక్షుల టాక్సోనోమిక్ జాబితా 21/02/2003 ప్రకారం.
- నెమలి జాతుల సమాచారనిధి
- పీఫౌల్ టుడే(ఈనాటి నెమలి)
- భారత దేశంలో వివిధ పక్షుల నివాస ప్రాంతాలను గూగుల్ పటములలో చూడండి.